Monday, February 28, 2011

తల్లి హృదయం **** *

నీవు నా కడుపున గంతులు వేస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంటే అనిపించింది,
నీవు చాల హుషారు కలవాడవని...

నీవు నా గర్బాన్ని చీల్చుకుని బయటకు వస్తుంటే అనిపించింది,
నీవు దేనినైనా తెగించగలవాడవని...


నీవు నా రక్తాన్ని పాలుగా త్రాగుతుంటే సంతోషం అనిపించింది,
నీవు చాల బలవంతుడువవుతావని...


నీవు అమ్మా అని పిలిచినప్పుడు పరమానందం కలిగింది,
నీవు గొప్ప విద్యావంతుడవవుతావని...

నీవు బుడి బుడి అడుగులు వేస్తుంటే అనిపించింది,
నీ కాళ్ళ మీద నీవు నిలబడ గలవని...

నేను మరణించినప్పుడు బాధగా వున్నా ధైర్యంఅనిపించింది ,
నేను లేకపోయినా నీవు బ్రతకగలవని...

కాని ఇప్పుడు బాధగా వుంది

నన్ను కాల్చేటప్పుడు నీ
చెయ్యి కాలుతుందేమోనని.....

Thursday, January 6, 2011

Wednesday, January 5, 2011




Thursday, December 30, 2010

Balayya comedy ....

బాలయ్య ఒక రోజు ఒక గ్రామం లోకి వెళ్ళాడు ....
ఒక గుడ్డి ముసలివాడు : బాబు ఇది పగలా,  రాత్ర...???
బాలయ్య : ఏమో తాత నేను కూడా ఈ ఊరికి కొత్త ....
ముసలివాడు : ఓరి బాలయ్య  నువ్వంట్రా వెధవ........ 

Wednesday, December 29, 2010

Kiran & His friends

Tuesday, December 28, 2010

New year wishes